బస్సును ఢీకొట్టిన లారీ

Nov 9, 2025 - 20:33
Nov 10, 2025 - 12:27
 0  5
బస్సును ఢీకొట్టిన లారీ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ బస్సును ఢీకొట్టిన లారీ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలు... ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని పాత సూర్యాపేట స్టేజి సమీపం లో సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సును వెనకనుంచి లారీ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సూర్యాపేట నుండి తొర్రూర్ వెళ్తున్న సూర్యాపేట డిపో ఆర్టీసీ బస్సు పాత సూర్యాపేట స్టేజి సమీపంలో సరస్వతి వనక్షేత్రంలో జరిగిన కార్తిక వన సమారాధన కు వెళ్ళి వస్తున్న బైక్ అదుపు తప్పి కింద పడినట్లు దాంతో తొర్రూరు వెళుతున్న బస్సు బ్రేకు వేసి నెమ్మదిగా వెళ్లడం తో వెనుక నుండి వేగంగా కలప లోడుతో వస్తున్న లారీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎనుమాముల గ్రామానికి చెందిన కల్లేపల్లి ఉపేంద్ర, నిమ్మికలకు చెందిన పురo రాణి లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని సూర్యపేట ఆసుపత్రికి 108 సహకారంతో తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.కార్తీక వన సమారాధన ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట దంతాలపల్లి రహదారి పై ట్రాఫిక్ ఏర్పడడం కారణం గానే ఈ ప్రమాదం జరిగిందనీ స్థానికులు తెలిపారు.