బస్తరు జిల్లాలో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని

Nov 30, 2024 - 14:28
Nov 30, 2024 - 17:52
 0  6
బస్తరు జిల్లాలో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని

తెలంగాణ వార్త:- బస్తరు జిల్లాలో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలి సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏల్లుట్ల ఉపేందర్* ఈరోజు సూర్యాపేటలో సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ కార్యాలయంలోఏలుట్ల మల్లేష్ అధ్యక్షతన జరిగిన కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 40 వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హాజరయ్యి మాట్లాడుతూ భూమి బుక్తి విముక్తి కోసం,గోదావరి లోయ పోరాటం లో ఎందరో అమరవీరులు అమరత్వం చెందారు. అమరవీరులు అందించిన నినాదం పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అనే నినాదం ఎంత గొప్పదో లగచర్ల ఘటనలో రైతులు నిరూపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, విముక్తి కోసం పోరాడి అమరులైన వీరులకు జోహార్లు అర్పిస్తూ చతిస్గడ్ లోని బస్థర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కాగరు ,అక్కడ గిరిజనల పై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బస్తర్ జిల్లాలో అమాయకులైన ఆదివాసులను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి అమీత్షా ఆదివాసుల రక్తానికి మరిగి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోపిడిదారులకు దోచిపెట్టడానికి పూనుకున్నది ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అమాయకులైన ఆదివాసి గిరిజనులను చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ల పేరా కాల్చి చంపుతున్నారు. ఇప్పటికైనా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చత్తిస్గఢ్ భాస్కర్ జిల్లాలో జరుగుతున్న సామూహికదాడులను వెంటనే ఆపివేయాలి డిమాండ్ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో సి పి యు ఎస్ ఐ ఆర్ ఎం ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి చామకూరి నరసయ్య కార్మిక సంఘం నాయకులు పాముల మల్లేష్ పిడిఎస్యు విద్యార్థి సంఘ నాయకులు శ్రీకాంత్, మధు తదితరులు పాల్గొన్నారు.