బహుజన ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ 

Aug 18, 2025 - 18:55
 0  14
బహుజన ధీరుడు సర్వాయి పాపన్న గౌడ్ 

 బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్ జయంతి లో ఘన నివాళులు అర్పించిన బహుజన నాయకులు 

 బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు

 బహుజన దీరుడు గోల్కొండ ఖిల్లాను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో నిర్వహించగా కార్యక్రమానికి హాజరైన బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ... 


 తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు దొరల అరాచకాలు మొగలాయిల దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన సర్వారాయ్ పాపన్న గౌడ్ చరిత్ర పురుషుడని ఆయన అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్,ను స్ఫూర్తిగా తీసుకొని సమాజం ముందుకు వెళ్లాలని కేవలం పిడికెడు మంది సైన్యంను సమీకరించి గోల్కొండ కోట రాజధానిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు సర్వాయి పాపన్న అని ఆయన అన్నారు బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ.... సర్వాయి పాపన్న గౌడ్ తొలి బహుజన చక్రవర్తి అని స్వాతంత్ర సమరయోధులు బహుజనులు అందరిని ఐక్యం చేసి రాజ్యాధికారం కోసం పోరాడిన మొట్టమొదటి వ్యక్తి అని ఆయన ఆశయ సాధన కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలు  రాజ్యాధికారం కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు సర్వాయి పాపన్న గౌడ్ నిరుపేద కుటుంబంలో పుట్టి నప్పటికీ గోల్కొండ కోట రాజుగా పరిపాలించడం ఎంతో గర్వించదగ్గ విషయమని బహుజన రాజ్యం కోసం సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం చేయడం జరిగిందని సర్వాయి పాపన్న గౌడ్ కన్న కలలను ఆయన ఆశయ సాధన కోసం బహుజనులంతా ఏకం కావాలని బహుజన రాజ్యం కావాలని ఆయన కోరారు 
 కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, కొప్పు రామకృష్ణ సామాజిక కార్యకర్త తక్కెళ్ళ నాగార్జున కరుణాకర్ పరికె భరత్ తదితరులు పాల్గొన్నారు

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333