ప్రైవేట్ స్కూల్ బస్సులపై ట్రాఫిక్ పోలీస్ అధికారుల తనిఖీలు: ట్రాఫిక్ ఎస్సై  బాలచంద్రుడు

Jul 29, 2025 - 19:18
 0  9
ప్రైవేట్ స్కూల్ బస్సులపై ట్రాఫిక్ పోలీస్ అధికారుల తనిఖీలు: ట్రాఫిక్ ఎస్సై  బాలచంద్రుడు

స్కూల్ వాహనాన్ని నిలిపి పత్రాలను తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్సై  .

జోగులాంబ గద్వాల 29 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పట్టణం:-పాఠశాల బస్సులు ప్రమాదాలు గురి చేస్తుడంతో గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు తన ట్రాఫిక్ సిబ్బంది తో కలిసి ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ నిర్వహించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ సర్కిల్ నందు జిల్లాలోని పై అధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ స్కూల్ బస్సులపై ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు  ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.  


  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ స్కూల్ బస్సులను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అనుభవజ్ఞులైన డ్రైవర్ తో పాటు క్లీనర్ తప్పకుండా ఉండేలా మెయింటైన్ చేయాలన్నారు. ఇందులో ఏ ఒక్కటి తగ్గిన కేసులు తప్పవన్నారు.ప్రైవేట్ పాఠశాల చెందిన బస్సులో 40 సీటింగ్ కెపాసిటీ ఉంటే అందులో 50 మంది విద్యార్థులను ఎక్కించి తీసుకెళ్తున్నారు.కెపాసిటీకి మించి విద్యార్థులను తరలించడంతో కేసులు నమోదు చేయడం జరుగుతుంది.ఈ తనిఖీలు ప్రతిరోజు కొనసాగుతాయని అన్నారు.నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్ బస్సులపై కేసుల నమోదు చేయడం జరుగుతుందని ట్రాఫిక్ ఎస్ఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333