రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే వరకు రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ..

Apr 6, 2024 - 20:04
 0  12
రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే వరకు రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ..
రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే వరకు రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ..

 రైతుల కోసం కేసీఆర్ పొలాల బాట పడితే...

 పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ నాయకుల శభాష్ కోసం చేరికల బాట పట్టిన సీఎం

 రైతులకు 25 వేల నష్టపరిహారం చెల్లించాలి ధాన్యము కొనుగోలు పై క్వింటాకు 500 రూపాయలు బోనస్ ను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే . 

జోగులాంబ గద్వాల 6 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. శనివారం   జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతీ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్  పిలుపుమేరకు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * ఆధ్వర్యంలో *రైతు దీక్ష కార్యక్రమము రైతులు నిర్వహించడం జరిగినది.   నీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి నష్టపరిహారంగా 25 వేల రూపాయలు ఇవ్వాలనీ, ధాన్యము కొనుగోలుపై క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వీటితోపాటుగా వారంటీ గ్యారెంటీ లేని ఆరు గ్యారెంటీ పథకాలను కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే ...


  ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.....


పదేళ్ల కెసిఆర్ పాలనలోని తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించడం జరిగింది, ఏనాడు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా నాయకుడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే  ప్రతిక్షణం రైతుల గురించి ఆలోచించేవారు ప్రతిక్షణం రైతులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సకాలంలో 24 గంటల కరెంటు అందిస్తూ..  రైతులు పండించడానికి సాగునీరు ప్రతి చివరి ఆయకట్టు వరకు అందించి రెండు పంటలు రైతులు పంటలను పండించుకునే విధంగా కృషి చేయడం జరిగింది. కెసిఆర్ గారు రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి రైతుల గురించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతు అన్నకు అండగా నిలిచి వారి వ్యవసాయానికి పెట్టుబడి సహాయంగా రైతుబంధును అందించారు అదేవిధంగా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గ్రామాలలోని రైతులు పండించిన ధాన్యమును కొనుగోలు చేసే విధంగా కృషి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే రైతులకు కరువు ఏర్పడింది. రైతులకు సరైన నీళ్లు లేక కరెంటు లేక పొలాలు ఎండిపోతున్నాయి. రైతు బాధ వర్ణాణాతితంగా మారింది. ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలను ప్రజలకు చెప్పి ఒట్టి మాటల విధంగా మారాయి 2 లక్షల రుణమాఫీ రెండు రోజుల్లో అధికారంలోకి వస్తాం రెండు లక్షల రుణమాఫీ మాఫీ చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టుకున్నారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కూడా ఆరు గ్యారెంటీలు అంటూ వారంటీ లేని కరపత్రాన్ని ప్రజలకు చూయించి మాయ మాటలు చెప్పి మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకొచ్చిన కొద్ది రోజుల్లోనే 100 రోజుల కాలంలోనే ఇలాంటి అభివృద్ధికి కార్యక్రమాలు చేయలేక ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నిర్వహించలేదు కేవలం ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వెళ్లడం వారినీ ప్రలోభాలు పెట్టి అధికారంతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజా సంక్షేమం గురించి, రైతుల సంక్షేమం గురించి ఆలోచించాలని కోరారు లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు  గురికావాల్సి వస్తుందనీ అతి త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.

  ఎమ్మెల్యే  మాట్లాడుతూ.....


గతంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం జరిగింది. వారి వల్ల సాధ్యం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పదేళ్ల కెసిఆర్ గారి పాలనలోనే సాధ్యం కావడం జరిగింది. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం కేసిఆర్ కె సాధ్యం కావడం జరిగిందనీ. కెసిఆర్ గారు ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలకె తెగించి పోరాడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణంలో మార్పులు చేసే విధంగా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేశారు బంగారు తెలంగాణ అంటే వ్యవసాయంలో రైతు అభివృద్ధి చెందినప్పుడే వెన్నెముక లాంటి రైతు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ అవకాశం ఉంటుందని గ్రహించి రైతుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రైతులు పెట్టుబడి కోసం గ్రామాలలో ఉన్న పెద్ద పెద్ద భూస్వాముల వద్ద, సేట్ల వద్ద గంజిలలో ఉన్న సౌకర్ల వద్ద అప్పుల కోసం వెళ్లి ఎన్నో అవస్థలు, అవమానాలు పడేవారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్  రైతుల పెట్టుబడి సహాయానికి రైతుబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టి వారికి రెండు పంటలకు పదివేల రూపాయలు అందించి దేవుడైన ఏకైక నాయకుడు కేసీఆర్ ని గర్వంగా చెప్పారు. పెట్టుబడితో కాకుండా రైతులకు సరైన సమయంలో సాగునీరును అందిస్తూ రెండు పంటలను రైతులు పండించి ప్రతి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్  రైతుల కోసం కాలేశ్వరం వంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంటు ఉచితంగా రైతులను అందించడం జరిగింది. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అనే విషయాన్ని రైతులు ఎన్నో ఇబ్బందులు పడి విద్యుత్ షాకులతో రైతులు చనిపోయేవారు. కానీ కెసిఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అందిస్తూ రైతులకు ఏ సమయంలో వెళ్ళిన తమ వ్యవసాయపు పనులు చేసుకునే విధంగా పంట పొలాలను పండించుకునే విధంగా 24 గంటల కరెంటు అందించిన ఘనత ఒక కేసీఆర్ కి దక్కుతుందని స్పష్టం చేశారు. గతంలో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు సరైన వ్యవసాయం లేక పొలాలు పంటలు పండక్క పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు పాలమూరు ప్రాంతం నుండి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్లి జీవనోపాధి కోసం వెళ్లేవారు. అలాంటి పరిస్థితి మరొకసారి రాష్ట్రంలో మన ఉమ్మడి పాలమూరు జిల్లాలలో కనిపిస్తుంది ఈ 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలనలో మరొకసారి రైతులు ముంబై కర్ణాటక తమిళనాడు వంటి ప్రాంతాలకు మళ్ళీ వెళ్లే పరిస్థితి మరొకసారి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరైన సాగునీరు అందించి కరెంటు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు.   గతంలో వ్యవసాయం అంటే దండగ అనేవారు కానీ వ్యవసాయమని పండగని నిరూపించిన నాయకుడు కేసీఆర్... శనివారం మాయ మాటలు చెప్పి రైతులకు మోసం పూర్వకమైన పథకాలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టుకుంది. కానీ ఏనాడు కూడా రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ సీఎం కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క చిన్న రైతుతో మాట్లాడిన పాపాన పోలేదు రైతుల గురించి ఏ ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించాలన్న ఆలోచన చేయలేదు. రైతుల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు నిజమైన రైతుబిడ్డ కెసిఆర్  కాబట్టి తన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోయినా కూడా రైతుల కోసం అండగా నిలపడం జరిగింది. ఈ కరువు తో బాధపడుతున్న రైతులకు నేను అండగా ఉన్నాను టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రతి రైతును కలిసి మాట్లాడుతూ వారి యొక్క కష్టసుఖాలను వారి యొక్క బాధలను తెలుసుకోవడం జరుగుతుంది. ఇకనైనా సీఎం  వెంటనే అధికారులతో సమీక్షించి రాష్ట్రానికి రావాల్సిన కరెంటును నీళ్లను విడుదల చేసి కర్ణాటక రాష్ట్రంలో మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది కాబట్టి ఆ ముఖ్యమంత్రి తో మాట్లాడి వెంటనే నాలుగైదు టీఎంసీల నీళ్లను విడుదల చేసే విధంగా కృషి చేయాలి కొంతమేరకైనా ఈ ఎండాకాలంలో చేతికొచ్చిన పంటను చేజార్చుకునే విధంగా ఉండకుండా రైతులకు నీరును అందించాలని డిమాండ్ చేస్తున్నాం.
  రైతుల కోసం పోరాడడానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుంది ఈ ఒక్క పోరాటంతో కాదు భవిష్యత్తులో మీకు రైతులకు నీళ్లు అందించకపోతే భవిష్యత్తులో మీకు తగిన బుద్ధి చెప్పే విధంగా రైతుల పక్షాన పోరాటడానికి బిఆర్ఎస్ సైనికులు కేసీఆర్ వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
  గద్వాల నియోజకవర్గంలో ఈ నెల 15వ తేదీ నాడు జల దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గద్వాల నియోజకవర్గ రైతాంగం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జలదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
  త్వరలో జరగబోయే  పార్లమెంటు ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీకి తగిన  గుణపాఠం చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్  బలపరిచిన అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరారు.


   ఈ కార్యక్రమంలో జిల్లా  గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీలు విజయ్ రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, వైస్ ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి రామకృష్ణ నాయుడు, కౌన్సిలర్ నాగిరెడ్డి మురళి నరహరి శ్రీనివాసులు దౌలు, ఎంపీటీసీ దౌలన్న, మాజీ సర్పంచులు , గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, కె.టి దొడ్డి పార్టీ అధ్యక్షులు ఉరుకుందు,  బిఆర్ఎస్ పార్టీ సీనియర్  నాయకులు రమేష్ నాయుడు,  సత్య రెడ్డి విక్రమ్ సింహరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, చక్రధర్ రావు, హనుమంతు,  రాధాకృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, తూం కృష్ణ రెడ్డి,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్, షుకర్, మాజీద్,  అజయ్ , వెంకటేశ్వర రెడ్డి,  సాయి శ్యామ్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, కృష్ణయ్య సార్ ,  ధర్మా నాయుడు, రిజ్వాన్,  భగీరథ వంశీ, మహబూబ్ , నవీన్ రెడ్డి కురుమన్న , హరి ప్రసాద్ గౌడ్, ప్రభాకర్ గౌడ్  మోబీన్, నరేందర్ రెడ్డి, యుగంధర్ గడ్, బీచుపల్లి, నీలేశ్వర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, రమేష్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి శ్యామ్, సీతారాములు, జానకీ రాములు, మధు, పూడూరు రఘు, రామాంజనేయులు,  లక్ష్మన్న, నరసింహులు, పరుశ,  గంట రమేష్ , గంగాధర్ గౌడ్, గంజి పేట రాజు, విజయ్, పరశురాముడు, గోవిందు, ప్రవీణ్ , రాముడు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333