ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

Jun 19, 2025 - 15:14
Jun 19, 2025 - 19:28
 0  23
ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండల పరిధిలోనీ ఏపూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేటు పాఠశాల వ్యాన్లను అడ్డుకున్నారు 1వ తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉన్న ప్రవేట్ పాఠశాల వారు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ పల్లెటూరు నుంచి పట్టణానికి తీసుకుపోతున్నారు అని గ్రామస్తులు సహకారంతో ప్రైవేటు పాఠశాల వ్యాన్లను అడ్డుకొని ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎండి బాసిత్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తామని 2024-25 సంవత్సరం 10వ తరగతిలో 37 మంది విద్యార్థులకు గాను 37 మంది ఉత్తీర్ణతులై 520 మార్కులు సాధించారని అన్నారు.ప్రభుత్వం పాఠశాల లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు స్కూల్ డ్రెస్ నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్ని సబ్జెక్టులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని .విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరిస్తే అన్ని విధాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రతి రోజు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. నాణ్యమైన విద్య అందిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.