రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆచర్లగూడెం గూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకి అందించిన
వ్యవసాయం మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు రెవెన్యూ,గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సూచనమేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లో అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని తెలిపారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి కేటాయింపు చేశామని ఆయన తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఆయన అన్నారు. మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన చెప్పారు.