పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను సస్పెండ్
చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు

జోగులాంబ గద్వాల 18 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల రాజోలి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులోని వ్యక్తులను పోలీస్ అధికారులు మహబూబ్ నగర్ జైలు నుండి ఆలంపూర్ కోర్టు కు తీసుకవచ్చే క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటనలో ఒక RSI, ఇద్దరు ARSI లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.