ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం తిట్ల పంపిణీ

Apr 29, 2025 - 21:01
Apr 30, 2025 - 18:36
 0  4
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం తిట్ల పంపిణీ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆత్మకూరు నందు క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్యాధికారి Dr. మౌనిక మరియు ఎంపీడీవో హసీం గారి ఆధ్వర్యంలో పోషకాహార కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక గారు మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ వాటికి అనుబంధంగా పోషకాహారం తీసుకున్నట్లయితే వ్యాధి త్వరగా నయం అవుతుందని అందువల్ల ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని, క్రమం తప్పకుండా ఫాలో పరీక్షలు చేయించుకోవాలని వ్యాధిగాస్తులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాధిగ్రస్తులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చెరుకు యాదగిరి, సూపర్వైజర్ మాణిక్య, టీబీ సూపర్వైజర్ ఫ్రెన్సీ,T.B మోడల్ పర్సన్ కొండ్లె శ్రీనివాస్, ఎఎన్ఎంలు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.