ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటిక్యాలను సందర్శించిన డిఎంహెచ్ఓ డాక్టర్ జె సంద్యా కిరణమై
అన్ని హెల్త్ ప్రోగ్రాం లపై ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది అందరికి రివ్యూ మీటింగ్.
జోగులాంబ గద్వాల 25 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇటికాలను జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సంధ్యా కిరణమై సందర్శించి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి ఆల్ ప్రోగ్రామ్స్ పై రివ్యూ తీసుకున్నారు....
••• సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీ సాధారణ డెలివరీల యందు, ఓపి సేవలు, ల్యాబ్ మరియు ఫార్మసీ అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు అందరూ సమయపాలన పాటించి విధుల యందు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలిపారు.. అంతేకాక, మాత శిశు సంరక్షణ సేవలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింత తల్లులు , ప్రభుత్వ ఆసుపత్రులకు డెలివరీకి వెళ్లేటట్టు మోటివేషన్ చేయాలని, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించవద్దని...అదేవిధంగా ఎన్సీడీ స్క్రీనింగ్ 30 సంవత్సరాల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి ఆన్లైన్ చేయాలని మిగిలిన నాలుగు నెలలలో.. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని సందర్భంగా తెలిపారు.. ఒక్కొక్క సబ్ సెంటర్ యొక్క డెలివరీలను అడిగి తెలుసుకున్నారు.. మొదటి ప్రైమ్ మినిస్టర్ నందు టార్గెట్ ప్రకారంగా నమోదు చేయాలని, పిఎన్సి విజిట్లు చేయాలని తెలిపారు... టీబి,లేప్రోసి, మరియు పాలియేటి ఒకేర్ క్యాన్సర్ పేషెంట్ల యొక్క జాబితా నందు ఉన్న వారిని జిల్లా ఆస్పత్రులకు పంపితే అక్కడ ట్రీట్మెంట్.. నమోదు చేసుకుని సేవలు అందిస్తారని సందర్భంగా తెలిపారు, అదేవిధంగా జిర్యాట్రిక్ సేవలు, 60 సంవత్సరములు పైబడిన వారు వృద్ధులను జిల్లా ఆసుపత్రిలో 20 పడకల వసతులు ఉన్నాయని ఏ ప్రాబ్లం వచ్చిన అక్కడికి రెఫర్ చేయాలని సందర్భంగా తెలిపారు... ప్రతి ప్రోగ్రాం నందు 100% లక్ష్యాలను పూర్తి చేసి జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలిపారు.. అనంతరం పిహెచ్సి నందు ప్రతి వార్డును సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు...
••• ఇట్టి రివ్యూ మీటింగ్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది.. డాక్టర్ శరణ్య,జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ , ఎస్ టి ఎస్ రమేష్, సూపర్వైజర్లు, సత్యమ్మ,వెంకటేష్, నాగమ్మ ఎం పి హెచ్ ఈ ఓ శేఖర్,MLHP స్టాఫ్, అనిరుద్, అనూస, రుక్మిణి,ఫార్మసిస్ట్ భిక్షపతి, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు.. పాల్గొన్నారు.