రోడ్డును కంకర పరిచి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గృహస్తులు దుకాణ యజమానులు.

జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: వడ్డేపల్లి. మండలంలోని శాంతినగర్ నుండి రాజోలి వెళ్లే రోడ్డును కంకర పరిచి వదిలివేయటంతో ఆ రోడ్డు ప్రక్కన ఉన్న గృహస్థులు , దుకాణాలు యజమానులు దుమ్ము, ధూళి తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.? గత నెలలో పెళ్లి కావాల్సిన యువకుడు ఆసుపత్రి పాలయ్యారు. సంబంధిత అధికారులు కానీ, కాంట్రాక్టరు కానీ స్పందించి వెంటనే తారు రోడ్డు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కనీసం నీళ్ళు కూడా పట్టకుండా వుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.