ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
తిరుమలగిరి 28 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ లో భాగంగా తిరుమలగిరి మండలం వ్యాప్తంగా పట్టభద్రుల యువత తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్, జుమ్మిలాల్ కందుకూరి లక్ష్మయ్య ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు కందుకూరు అంబేద్కర్ మరియు అధ్యాపకులు, విద్యావంతులు డాక్టర్లు పోలీసులు నిరుద్యోగులు ఓటు పై ఆసక్తి చూపారు .అదేవిధంగా తిరుమలగిరిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద పోలింగ్ సరళిని పరిశీలించిన తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామేల్. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ దంపతులు తిరుమలగిరి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 449 బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు తిరుమలగిరి తహసిల్దార్ తెలిపిన వివరాల ప్రకారం 448,449పోలింగ్ కేంద్రాలు ఉండగా తిరుమలగిరి మండల వ్యాప్తంగా 1692 ఓట్లకు గాను 1256 ఓట్లు నమోదు.78.69% ఓటింగ్ పోలైనట్లు సమాచారం.గతంతో పోల్చుకుంటే ఓటరు నమోదు శాతం స్వల్పంగా తగ్గిందని తెలిపారు