ప్రశాంతంగాఎమ్మెల్సీ పోలింగ్
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ప్రశాంతంగాఎమ్మెల్సీ పోలింగ్ ఆత్మకూరు ఎస్.... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా చివరి ఘట్టం సోమవారం పోలింగ్ ఆత్మకుర్ ఎస్ మండలం లో ప్రశాంతంగా జరిగింది. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆత్మకూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ బూతుల ఏర్పాటు చేసి ఓటర్లకు తగిన సౌకర్యాల ను కల్పించారు. మండల కేంద్రం లో మొత్తం 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అయి సాయంత్రం 4గంటల కు ముగిసింది.పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి పట్ట భద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఆత్మకూర్ ఎస్ 73.14% పోలింగ్ నమోదు మొత్తం ఓట్లు2023, పోలైన ఓట్లు1487 పోలింగ్ కేంద్రం నెంబర్ 435 మొత్తం ఓట్లు 1050 పోలైన ఓట్లు766, 436 పోలింగ్ కేంద్ర నెంబర్ మొత్తం ఓట్లు1023, పోలైన ఓట్లు 721 మధ్యాహ్నం మూడు గంటల వరకు మండలంలో దాదాపు ఎక్కువ శాతం ఓటింగ్ అయింది.zp వైస్ చైర్మన్ గోపాగాని వెంకట నారాయణ గౌడ్ తన ఓటు హక్కును మండల కేంద్రంలో వినియోగించుకున్నారు.