శాంతి భద్రతలకు సంబందించిన ప్రతి ఫిర్యాదు పై వెంటనే చర్యలు తీసుకోవాలి
* జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS.
జోగులాంబ గద్వాల 27 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా ని శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల పై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రితిరాజ్,IPS పోలీస్ అధికారులను ఆదేశించారు. . సోమవారం ప్రజాదివాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ మండలాల నుంచి వచ్చిన 12 మంది బాధితుల నుంచి ఎస్పీ పిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిర్యాదుల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల పై వెంటనే చర్యలు చేపట్టాలని,విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోని, నివేదికను అందజేయాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఈ రోజు వచ్చిన పిర్యాదులలో భార్య భర్తల గొడవ కు సంబంధించి -01 ఫిర్యాదు. భూ వివాదాలు, గొడవలకు సంబందించి -04 ప్లాట్ కబ్జాకు సంబంధించి-03 పైపు లైన్ ధ్వంసం కు సంబంధించి -01 మినుములు కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదని - 01 ఇతర అంశాలకు సంబంధించి-02 పిర్యాదులు వచ్చాయి. పి ఆర్ ఓ ఆఫీసు నుంచి తెలియజేశారు.