తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్

Sep 20, 2024 - 21:03
 0  14
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్

సీఎం చంద్రబాబు కు కీలక ఆదేశం

ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా వివరించారు.

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వార్త శ్రీవారి భక్తుల్లో ఆందోళన నింపింది. ఈ నేపథ్యంలో లడ్డూ కల్తీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333