కరోనా తర్వాత చైనాలో వెలుగులోకి కొత్త వైరస్
మెదడుపై తీవ్ర ప్రభావం చూపే వెట్‌ల్యాండ్ వైరస్ లక్షణాలు ఏమిటంటే?
గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రభావం నుంచి పూర్తిగా ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే చైనాలో పుట్టి యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారిని పూర్తిగా మరచిపోకముందే.. మళ్ళీ డ్రాగన్ కంట్రీలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కొత్త వైరస్ మెదడుపై దాడి చేస్తుందని సమాచారం. చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్ (WELV) అనే కొత్త వైరస్ కనుగొనబడింది.
మంగోలియాలోని వరి పొలంలో అతను పరాన్నజీవుల కాటుతో అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు జిన్‌జియాంగ్ వెట్‌ల్యాండ్ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఐదు రోజుల పాటు, అతను జ్వరం, తలనొప్పి ,వాంతులు వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో మరిన్ని జీవులను పరీక్షించారు. 2 శాతం పరాన్నజీవులు WLV జన్యు పదార్ధాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు.
WELV అనేది కొత్త వైరస్ కాదు, మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది.. అయినప్పటికీ, మానవులకు, జంతువులకు సోకే సామర్థ్యం కారణంగా ఈ వెట్‌ల్యాండ్ వైరస్ ఆరోగ్యానికి హానికరం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జంతువులలో రక్త నాళాలలో నిర్మాణాత్మక మార్పులు ఈ ప్రాణాంతక సంక్రమణకు కారణమవుతాయి.
వెట్‌ల్యాండ్ వైరస్ కు చికిత్స ఉన్నప్పటికీ వైరస్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది. WELV వైరస్ ఉత్తర చైనాలోని జంతువులు, మానవులలో కూడా కనుగొనబడింది. ఈ వైరస్ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ వైరస్ క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపుకు చెందినది. ఇది మానవులలో తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది. ఇది కొన్ని రకాల పరాన్నజీవులలో వ్యాపిస్తుంది. ఇప్పటికే గుర్రాలు, పందులు, గొర్రెల్లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు
తల తిరగడం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని వైద్యులు తెలిపారు......