ప్రమాదం లో ప్రధమ చికిత్స 

మనుగడ కోసం అవస్థలుపడుతున్న ఆర్ ఎం పి మరియు పి ఎం పి

Oct 5, 2024 - 20:01
Oct 5, 2024 - 20:06
 0  16
ప్రమాదం లో ప్రధమ చికిత్స 

చర్ల అక్టోబర్ 05 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఆర్ ఎం పి మరియు పి ఎం పి లుగా గ్రామ గ్రామాణ ఉంటూ వాళ్ళు నేర్చుకున్న అనుభవంతో  తెలిసిన వైద్యం అందిస్తూ పేదల డాక్టర్ గా గుర్తింపు పొంది పేదల పాలిట దేవుళ్ళు అయ్యారు. కానీ ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ ఆర్ ఎం పి లు వారి స్థాయికి మించి వైద్యం చేయడం, అవసరం ఉన్నా లేకున్నా రక్తపరీక్షలు పేరిట రిఫరల్స్ పేరిట పేదల రక్తాన్ని పీల్చివేస్తూ పేదల పాలిట యముడు వలే తయారయ్యారు. మండలం మొత్తంలో ముగ్గురు లేక నలుగురు ఆర్ ఎం పి లు వారి స్థాయికి మించి వైద్యం చేస్తూ అందరికీ చెడ్డ పేరు తెస్తున్నారు. ఏ అధికారుల అండతో వారు అలా చేస్తున్నారో వారికే తెలియాలి. ఒక ఆర్ఎంపి కి కనీసం ఇంజక్షన్ చేసే అర్హత లేదు అని చెప్తూనే వారి సేవలు వినియోగించుకుంటున్నారు.అర్హత లేని ఆర్ ఎం పి సేవలు ఎందుకు కొనసాగిస్తున్నారు.ఈ ఆర్ఎంపి లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తాం, ప్రభుత్వం తో మమేకం చేసి వారి సేవలు వినియోగించుకుంటాం అని ఎలక్షన్స్ సమయంలో వాగ్దానం చేయడం ఎలక్షన్స్ ఐపోగానే వారి ఊసే ఉండదు సరికదా అర్హత లేకుండా వారు వైద్యం ఎలా చేస్తారని చెప్పడం పరిపాటుగా మారింది. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరిని భలిచేయడం ఎంతవరకు సబబు. ఆర్ధిక పరిస్థితి సరిగా లేక కొన్ని సంవత్సరాల పాటు హాస్పిటల్స్ లో నేర్చుకొని ఆ అనుభవంతో పొట్ట చేతబట్టుకొని ఊరు కాని ఊరు వచ్చి వైద్య సేవలు అందిస్తూ ఆ గ్రామ ప్రజలలో ఒకడిగా ఉంటూ, కుటుంబ సభ్యుడుగా మెలుగుతూ కలిసి మెలిసి ఉన్న ఆ ఆర్ ఎం పి ఇప్పుడు అర్హత లేదు అని ప్రచారం చేయడంతో వైద్యం చేద్దాం అంటే అర్హత లేదు అని పోనీ హాస్పిటల్ కి పంపిస్తే కమిషన్ కోసం పంపుతున్నాడు అని నిందలు వేయడం వలన పూట గడవటం కూడా కష్టంగా మారిందని కొందరు ఆర్ ఎం పి లు భాధపడుతున్నారు. గ్రామంలో ప్రతీ పని చేసే వారికి విలువ ఉంది కానీ ఆర్ ఎం పి కి మాత్రం అవమానాలే ఉన్నాయి అని ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్ ఎం పి లకు గుర్తింపు ఇచ్చి వారి అనుభవాన్ని ప్రభుత్వ పరంగా వారి సేవలు వినియోగించుకొని ఆర్ ఎం పి లను కాపాడాలని లేదంటే తక్షణమే ఈ ఆర్ ఎం పి వ్యవస్థ లేకుండా పూర్తిగా తీసివేయాలని, తెలిసిన పని చేయలేక వేరే పని చేతకాక ప్రతి రోజు అనుక్షణం ఇలా భయం భయంగా బ్రతకలేక పోతున్నామని, మమ్మల్ని కూడా సమాజంలో గుర్తించాలని కోరుకుంటున్నారు. ఈ ఆర్ఎం పి లలో కూడా అనేక సంఘాలు ఏర్పాటు చేసుకొని విడివిడిగా పోరాటం చేయడం వలన ఉపయోగం లేకుండా పోతుందని అన్నీ సంఘాలు ఏకమై ఆర్ ఎం పి మనుగడ కాపాడాలని గ్రామీణ వైద్యుల సహాయక సంఘం సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చల్లగుండ్ల సతీష్ కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333