ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

Nov 24, 2025 - 19:13
 0  1
ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

అర్హులైన పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలి.
        - కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి

          ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ సీతారామారావు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి, ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు ఉంచి, ఎన్నికలలో గెలిచినారని అన్నారు. ఈ డిసెంబర్ తొమ్మిదికి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న హామీల అమలులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ముచ్చట్లు చెప్పటమే కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో విఫలమైనారని ఆరోపించారు. గత ప్రభుత్వం కూడా పిట్టకథలతో కాలం వెలదీస్తే సమయం చూసి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అన్నారు.ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు.వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్స్ రెట్టింపు చేస్తామన్న వాగ్దానం, వ్యవసాయ కార్మికులకు నెలకు 1200 ఇస్తానన్న హామీ, మహిళలకు బ్యాంకులో 2500 వేస్తానన్న హామీ, నిరుద్యోగ భృతి ఏవి కూడా నెరవేరలేదని ఆయన ఆరోపించారు. అదేవిధంగా వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10000 నష్టపరిహారం చెల్లిస్తానన్న హామీ గాలికి వదిలేసినారని ఆరోపించారు. నష్టపోయిన రైతాంగానికి తాము ఇస్తామన్న పదివేలతో పాటు అదనంగా 40 వేలు కేటాయించాలని డిమాండ్ చేసినారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరినారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ పేర్ల నాగయ్య,పార్టీ హుజూర్నగర్ డివిజన్ కార్యదర్శి వాస పల్లయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొడ్డలి నర్సయ్య, సయ్యద్ హుస్సేన్,పిఓడబ్ల్యు  జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, ఉపాధ్యక్షురాలు సూరం రేణుక, పివైఎల్ జిల్లా కార్యదర్శి వాస కరుణాకర్, గులాం హుస్సేన్, పద్మ, లక్ష్మీ, శ్యామల, రేష్మ, విజయ్, మరియమ్మ, గౌరమ్మ,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333