ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ.
వామపక్ష, అఖిలపక్ష పార్టీలు & ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన ధర్నా .
మధ్యభారతంలోని హింస ను విడనాడి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరుపాలి .
ఆపరేషన్ కగార్ ను ఆపవేసే దాకా పోరాడుతాం .
BRS రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు,CPI జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు, CPM జిల్లా కార్యదర్శి వెంకటస్వామి .
జోగులాంబ గద్వాల 6 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల్. తెలంగాణ రాష్ట్ర అఖిల పక్ష పార్టీల కమిటీ పిలుపు మేరకు ఈరోజు వివిధ వామపక్ష, అఖిలపక్ష పార్టీలు & ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని పాత బస్టాండ్ సమీపంలో నిరసన ధర్నాను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యభారతంలోని మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలనీ మరియు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధ్యభారతంలో ని కర్రె గుట్ట అడవులు ఆదివాసులు, గిరిజనులను నివసించే ప్రదేశం అని అంతేకాకుండా ఆ అడవులలో ఉన్న సంపాదన దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లోనీ నరేంద్ర మోదీ అక్కడ చేపట్టిన యుద్ధమే ఆపరేషన్ కగార్ అని అన్నారు ఈ మధ్య భారతం లోని కర్రె గుట్టలలోనీ ఆదివాసులను చంపాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ వారికి మావోయిస్టులు అనే పేరు పెట్టి వారిని అక్కడ నుంచి తరిమికొట్టి ఆ కర్రగుట్ట అడవులలో ఉన్న ఖనిజ సంపదను దోచుకొని తన కార్పొరేట్ కంపెనీ మిత్రులయిన ఆదాని, అంబానీల దోచు పెట్టాలని ఉద్దేశంతో అమాయక ప్రజలైనటువంటి ఆదివాసీలను చంపడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ యొక్క మిత్రులైనటువంటి ఆదానీ, అంబానీల యెక్క ఆస్తి పెంచడం కోసం కార్పొరేట్ కంపెనీలతో చేయి కలిపి ఆమాయకమైన ఆదివాసీలను మావోయిస్టులతో పాటు కాల్చి చంపడం ఏమిటని మండిపడ్డారు. కావున వెంటనే ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం ఆపి, మావోయిస్టులు కోరినట్లు వారితో శాంతి చర్చలు జరపాలని వామపక్ష, అఖిలపక్ష& ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సిపిఎం, బిఆర్ఎస్, కాంగ్రెస్,ఎం ఎల్ న్యు డెమోక్రసీ పార్టీ, BRSV,రైతాంగ సమితి,tclc,AIKS రైతు సంఘం,AITUC ,CITU,AISF, రిక్షా కార్మికులు, హమాలీ సంఘాల నాయకులు,నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు,ఆంజనేయులు, వెంకటస్వామి, కుర్వ పల్లయ్య, జి గోపాల్, గోపాలరావు, సుభన్, ఫయాజ్,కార్తీక్, brs వాల్మీకి, సీపీఐ ఆశన్న, ఏఐటీయూసీ నాయకులు రంగన్న, ,CITU నాయకుడు నరసింహులు, AISF ప్రవీణ్ , ధర్మాన, తిమ్మప్ప, మస్తాన్, చిన్న, రవి,తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.