ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
చౌటుప్పల్ 21 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఆవరణంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వికలాంగుల ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.వికలాంగుల పెన్షన్ రూ 6వేలకు పెంచాలని,కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ చౌటుప్పల్ ఆర్డీఓ ఆఫిస్ ముందు దీక్షల సందర్బంగా మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 4016 నుండి 6వేలకు, వృద్ధులు,వితంతువులతో పాటు మిగతా చేయూత పెన్షన్స్ 2016 నుండి 4వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది.కానీ పెన్షన్ పెంపు కోసం ఎలాంటి చర్యలు తీసుకువడం లేదు.పెన్షన్ పెంచకుండానే ప్రస్తుతం ఇస్తున్నా పెన్షన్స్ లలో 1.92 లక్షల మంది పెన్షన్స్ 21 నెలల కాలంలో రద్దు చేశారు.2023 డిసెంబర్ నెలలో ప్రజాపాలన పేరుతో కొత్త పెన్షన్స్ కోసం ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తే 24.85లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.21నెలల నుండి కొత్త పెన్షన్స్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు.పెన్షన్ పెంపు,కొత్త పెన్షన్స్ మంజూరు కోసం 21 నెలల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.2025-26 బడ్జెట్లో నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేయూత పెన్షన్స్ కోసం అవసరమైన నిధులు కేటాయించలేదు.పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎన్.పి.ఆర్.డి మండల కార్యదర్శి రాయగిరి యాదగిరి రామన్నపేట మండల అధ్యక్షులు బలుగూరి అంజయ్య వలిగొండ మండల అధ్యక్షురాలు బర్ల పార్వతమ్మ,కట్ట సావిత్రమ్మ,దాసరి ప్రకాష్, పోతగల్లు యాదమ్మ, గోగీకార్ మనోహర్,కట్ట సంజీవ,అంతటి చరణ్,ఏటగోని ఉత్తరమ్మ తదితరులు పాల్గొన్నారు.