ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమం

Jan 2, 2026 - 19:25
 0  16
ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమం
ప్రపంచ దివ్యంగుల దినోత్సవం కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 2 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల Mpps చాగపూర్ పాఠశాలలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులను  ప్రోత్సహించడానికి వారికి డిసెంబర్ 3 న ఆట పోటీలు నిర్వహించడం జరిగినది. అట్టి పోటీలలో విజేతలైన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ చేతుల మీదుగా  విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగినది. అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ ని  ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ని, మరియు రెండవ వార్డ్ మెంబర్ సరస్వతి ని ఘనంగా సన్మానించడం జరిగినది... ఇట్టి కార్యక్రమంలో  ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం  జరిగినది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333