ప్రతి సాధారణ డెలివరీ పి ఎస్ సి లేదా  జిల్లా ఆస్పత్రిలోనే కావాలి :- డిఎంహెచ్వో డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప

Jul 3, 2025 - 19:44
 0  3
ప్రతి సాధారణ డెలివరీ పి ఎస్ సి లేదా  జిల్లా ఆస్పత్రిలోనే కావాలి :- డిఎంహెచ్వో డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప

 నెలవారి సూపర్వైజర్స్ సమీక్ష సమావేశంలో  ఆదేశాలు

పాల్గొన్న ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది జిల్లా సిబ్బంది.

జోగులాంబ గద్వాల 3జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల  జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఐడిఓసి జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో... ప్రాథమిక ఆరోగ్య కేంద్రల సూపర్వైజర్లకు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమీక్ష సమావేశానికి    డిఎంహెచ్వో డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల యందు  లేదా ప్రభుత్వ ఆసుపత్రి గద్వాల నందు సాధారణప్రసాలు జరగాలని,  కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెలివరీలు అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తపరిచారు.. ప్రతి గర్భిణీ ఇంటికి వెళ్లి.. ఏఎన్ఎం, ఆశ సూపర్వైజర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డెలివరీలకి రావాలని మోటివేషన్ చేయాలని.. వైద్య సిబ్బందికి సూచించారు.అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ జిల్లాలో టీం ఉంటుందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు... గ్రామాల యందు అప్రమత్తంగా ఉండి ఈ విషయాన్ని మెడికల్ ఆఫీసర్ కి తెలియజేయాలని సందర్భంగా తెలిపారు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎంహెచ్ఎన్, ఎన్సిడి, టీబి, ప్రోగ్రాంలో పై మాట్లాడడం జరిగింది.. ఇట్టి సమావేశానికి, డిపిహెచ్ఎన్ వరలక్ష్మి, DSO తిరుమలేష్ రెడ్డి, ఎన్సిడి సమన్వయ కార్యకర్త శ్యాంసుందర్, డిడిఎమ్ రామాంజనేయులు, మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రల సూపర్వైజర్లు అర్బన్ హెల్త్ సెంటర్ వారు.. పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333