సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి..... కటికం సత్తయ్య గౌడ్
మునగాల 30 ఏప్రిల్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి ;-
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు అమలు కాని ఆరు గ్యారెంటీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలను నయవంచన చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల పరిశీలకులు కటికం సత్తయ్య గౌడ్ ప్రజలను కోరారు, మంగళవారం బిఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి ఏ ఒక్క గ్యారెంటీ పథకం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు, తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలో గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో రైతులు అన్ని వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అంది మంచి పరిపాలన అందిందని అన్నారు,నేటికీ రైతులకు రైతుబంధు, కరెంటు, మంచినీళ్లు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీళ్లు పోతున్న ఈ నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఉన్న ఇద్దరు మంత్రులు ఈ జిల్లా వాసులకు తాగునీరు అందించలేని అసమర్ధ మంత్రులు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతున్నారు అని అన్నారు, కెసిఆర్ దిగిపోగానే తెలంగాణ ఈ మూడు నెలల్లో మళ్లీ 15 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రజలు మంచినీళ్లకు కరెంటుకు రోడ్లు ఎక్కె పరిస్థితులు వచ్చాయని, కెసిఆర్ అధికారంలో ఉండగా ఏ ఒక్క ఆడబిడ్డ మంచి నీటి కొరకు బిందెలు తీసుకుని రోడ్డు ఎక్కిన సందర్భం ఈ పదేళ్లలో ఎక్కడ లేదని అన్నారు,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే జనాలు మంచినీటికి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాన్ని గ్రహించి ఎన్నికల్లో తెలంగాణకు శ్రీరామరక్ష అయిన బిఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతుంటే బూతులతో సమాధానాలు దేవుళ్లపై ప్రమాణాలు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యమని అన్నారు, అదేవిధంగా మే 4వ తారీఖున కోదాడలో రోడ్డు షో కార్యక్రమానికి బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుంకరి అజయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తొగరు రమేష్,,సొసైటీ చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, మండల కార్యదర్శి ఎలక వెంకటరెడ్డి, కోలా ఉపేందర్ రావు,ఉడుం కృష్ణ ,నాగిరెడ్డి,ఎల్ పి రామయ్య,గన్నా నరసింహారావు, బుషి వెంకన్న, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.