ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

Aug 1, 2026 - 20:26
Aug 2, 2026 - 00:44
 0  13
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్

తిరుమలగిరి 02 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- వన మహోత్సవం సందర్భంగా తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండా గ్రామపంచాయతీ లో ఉన్న ప్రజలందరికీ ఇంటింటికి 5 మొక్కలు అందించడం జరిగినది ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రేమ్ ప్రసాద్ మాట్లాడుతూ చెట్లే మనకు ఊపిరి, చెట్లుంటేనే వర్షాలు, చల్లదనం అని, మన తర్వాతి తరాల కోసం మొక్కలు నాటాలని వారు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వారు కోరారు..ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు సురేందర్, వార్డ్ మెంబర్ గుగులోతు రవీందర్ అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్ రామచంద్రు మరియు ప్రజలు అందరూ పాల్గొన్నారు.. 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి