పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత దైర్యం

పోలీసు యూనిఫాంకు సమాజంలో ప్రత్యేక గౌరవం - జిల్లా ఎస్పి నరసింహ. 

Aug 1, 2026 - 12:37
Aug 1, 2026 - 12:38
 0  42
పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత దైర్యం
పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత దైర్యం
పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత దైర్యం
పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత దైర్యం

వారాంతపు పోలీస్ పరేడ్ నిర్వహణ.. హాజరైన జిల్లా ఎస్పి నరసింహ. 

సిబ్బంది గర్వంగా పోలీసు సేవలు అందించి గౌరవంగా ఉండాలని అని సూచించారు.

- వత్తిడి వద్దు.. స్వేచ్చగా పని చేయాలి.
- ప్రజా భద్రత, భరోసా పోలీసు కర్తవ్యం.
- ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో జిల్లా పోలీస్.

... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.

సూర్యాపేట 02 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీసు పరేడ్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎస్పి నరసింహ హైజరై సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి పరేడ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ పోలీసు యూనిఫాంకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది, యూనిఫాం లో ఉన్న పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత దైర్యం, అండ ఉంటుంది అన్నారు. గర్వంగా ప్రజలకు సేవలు అందించి గౌరవంగా ఉండాలి అని, క్రమశిక్షణ తో ఉంటూ విధుల్లో నైపుణ్యం చూపి సామర్థ్యంతో పని చేయాలని అన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిబ్బంది వ్యాయామం, యోగ వంటివి ఆచరిస్తూ శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి, వత్తిడి లేకుండా పని చేయాలని అన్నారు. ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి వచ్చే జీతాన్ని సక్రమ మార్గంలో పొదుపు చేసుకోవాలి, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి అన్నారు. పోలీసు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాం అన్నారు. 

పోలీసు శాఖ, పోలీసు అధికారులు ప్రజలకు సేవలు అందించడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు, ప్రజా భద్రత, రక్షణ పోలీసు లక్ష్యం అన్నారు..దీని కోసం రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నాము, సాంకేతికత సద్వినియోగం తో ముందుకు వెళుతున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీ లు రవి, ప్రసన్న కుమార్, నరసింహ చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానయ్య, సిఐ లు వెంకటయ్య, రాజశేఖర్, మగ్దుం అలీ, ఆర్ఎస్ఐ లు, పట్టణ, రూరల్ సర్కిల్స్ ఎస్ఐ లు, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333