కాంగ్రెస్ ప్రభుత్వం లోనే విద్యార్థులకు పౌష్టికాహారం

Aug 1, 2026 - 20:30
 0  3
కాంగ్రెస్ ప్రభుత్వం లోనే విద్యార్థులకు పౌష్టికాహారం

తిరుమలగిరి 02 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేసి, భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంట విధానాన్ని పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి విద్యార్థికి సమర్థవంతంగా చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పర్యవేక్షణ  చేపట్టాలి అన్నారు  ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు పులి మామిడి శోభ చిత్తలూరి జ్యోతి గ్రామ పంచాయతీ సెక్రటరీ అరుణ్ ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి