ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమే

May 3, 2025 - 18:52
 0  7
ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమే

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సూపరింటెండెంట్  ఇంజనీర్ రహీముద్దిన్.

జోగులాంబ గద్వాల 3 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమేనని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు సూపరింటెండెంట్  ఇంజనీర్ రహీముద్దీన్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నీటిపారుదల శాఖ లోని డివిజన్ నంబర్ - 2 లో తిరుపతాచారి సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తూ 2025 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా శనివారం పిజెపి క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ ఇంజనీర్ రహీముద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగ విరమణ తర్వాత ఏమి చేయాలో ఆలోచిస్తారని కానీ తిరుపతాచారి కి ఉద్యోగ విరమణ తర్వాత పౌరోహిత్యం చేసుకుంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శేష  జీవితం గడపాలని కోరారు. మంచితనానికి మారుపేరు తిరుపతచారి అని 36 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరి మన్ననలు పొందారని జీవితంలో కూడా మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందాలని కోరారు. తిరుపతాచారి 1989 జూన్ 15న టైపిస్టుగా గద్వాల సర్కిల్ ఆఫీస్ లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు 1992 మే 5న సీనియర్ అసిస్టెంట్గా ఎల్ ఏ ఆర్ డివిజన్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 నవంబర్ మూడున డివిజన్ టు లో సూపరింటెండెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2025 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ పొందారు. తిరుపత చారి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో అందరి సహాయ సహకారాలతో 36 ఏళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు తన ఉద్యోగ జీవితంలో సహకరించిన ప్రతి ఉద్యోగికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతాచారి సహచరిని సువర్ణ (వైష్ణవి), ఎన్ టి పి ఏ హనుమంతు, టెక్నికల్ అసిస్టెంట్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట రాజారెడ్డి, టీఎన్జీవో నాయకులు ఎన్. భీమన్న, నాగార్జునగౌడ్, బీజాపూర్ ఆనంద్, విష్ణు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333