ప్రతిభవంతులకు సన్మానం

Dec 25, 2025 - 11:27
 0  3
ప్రతిభవంతులకు సన్మానం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రతిభవంతులకు సన్మానం. ఆత్మకూరు ఎస్... మండల పరిధిలోని నెమ్మికల్ జ్యోతి రావు పూలే అంబేద్కర్ గ్రంధాలయం లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 3 ఫలితాల లో సెలెక్ట్ అయిన గుండమల్ల వంశీ,ఎంబిబిఎస్ పూర్తి చేసిన బొల్లెద్దు అభిషేక్,దోమల వినీషాలను మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహం వలననే మా విజయం సాధ్యమైందని, యువత తల్లిదండ్రులు నిర్దేశించిన మార్గంలో నడుచుకోవాలని యువత తో తమ అనుభవాలనుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ దండ వెంకటరెడ్డి, మనం ఫౌండేషన్ అధ్యక్షులు గంపల కృపాకర్. గంపల నారాయణ పురం జాన్, వేల్పుల వెంకన్న ఆనంద్, అనంత్, సాయి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.