మాడుగులపల్లి మండల బిజెపి పార్టీ సమావేశం

తెలంగాణ వార్తమాడుగులపల్లి;9 : మాడుగులపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షులు ఇటికాల జాన్ రెడ్డి, అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారుఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనారిటీ మోర్చా ప్రధాన షేక్ బాబా విచ్చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి బూత్ లో జరగాలని అలాగే పెండింగ్ లో ఉన్న బూత్ కమిటీలు పూర్తి చేయాలని అటల్జి శతజయంతి ఉత్సవాలు జరపాలని ఏప్రిల్ 14 నుంచి 23 వరకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరపాలని నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి నేతృత్వంలో గత 10 సంవత్సరాల్లో వికసిత్ భారత్ దిశగా పనిచేస్తుందని అన్నారు. స్థానికంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నరేంద్ర మోడీ కరోనా సమయం నుండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందించడం జరుగుతుందని ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని వర్క్ బోర్డు గురించి ప్రజలకు తెలియజేయాలని ప్రజా సమస్యలపై ,రైతు సమస్యలపై అనునిత్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడాలని ఆన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎండగట్టాలని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానని ఇవ్వలేదు అలాగే కళ్యాణమస్తు అని పెళ్లయిన ఆడపడుచులకు లక్ష రూపాయలు తులం బంగారం ఇవ్వలేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరగలేదని ఆన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ప్రజల కు తెలియజేయాలని రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలని అన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారం చేపడతామని క్రియాశీల సభ్యులకు మండల నాయకులకు బూత్ అధ్యక్షులకు కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకట్ రెడ్డి ,జిల్లా పార్టీ కౌన్సిల్ సభ్యులు బొమ్మ కంటి నరసింహ, యువ మోర్చా సాగర్ ఇన్చార్జి కడియం సైదులు ,జిల్లా ఓబీసీ మోర్చా ఉయ్యాల నరసింహ గౌడ్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు జక్క ఇందిరా, మండల నాయకులు రాచకొండ దశరథ పల్నాటి రామ్ రెడ్డి ,వీరబోయిన సైదులు ,బోలగాని ప్రభాకర్ గౌడ్, వేముల లక్ష్మణ్ ,దారమల్ల నాగరాజు ,దాసరి యాదగిరి, చిలుముల శ్రీనివాస్ రెడ్డి, ఐతగాని సైదులు ,వంశీ, నల్లబోతు సైదులు ,రాయవరపు గురుస్వామి ,తదితరులు పాల్గొన్నారు.