క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు
తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంతoగి వీరస్వామి గౌడ్
సూర్యాపేటటౌన్, డిసెంబర్ 24:- క్రైస్తవ సోదరులు అందరూ సంతోషంతో క్రిస్మస్ పండుగ నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ఆకాంక్షించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. క్రీస్తు పుట్టిన రోజున క్రైస్తవ సోదరులు అత్యంత ఘనంగా క్రిస్మస్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఏసుక్రీస్తు కు ప్రార్థనలు చేయాలని క్రైస్తవులను కోరారు. శాంతి, సామ్రాస్యాలకు ప్రతీకగా జరుపుకునే క్రీస్తు జననం పండుగ క్రిస్మస్ అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సమాజంలో క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమని ఏసుప్రభు జీవనం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఆయన బోధనల ద్వారా మానవాళి సన్మార్గం వైపు నిస్సహాయువులపై కరుణ, సాటివారిపై ప్రేమ, సహనం, దాతృత్వం , త్యాగం, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు మహోన్నత సందేశాలన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుడు ఆశీస్సులు, దీవెనలు ప్రజలకు ఉండాలని కోరుతూ ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.