పోస్టర్, ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా జగ్గయ్యపేట - ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు

Oct 14, 2024 - 15:08
Oct 14, 2024 - 16:44
 0  3

జగ్గయ్యపేట పట్టణాన్ని పోస్టల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ గారు ఈరోజు మున్సిపల్ వారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఎక్కువ అవ్వడం వల్ల పట్టణ ప్రజలు ప్రయాణాల్లో ఇబ్బంది పడుతున్నారని,వాహనదారులకు దారి కూడా కనపడని విదంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని,అది మాత్రమే కాకుండా పట్టణమంతా ఎక్కడపడితే అక్కడ పోస్టల్స్ ఉండటంతో పట్టణ రోడ్లపై ప్రయాణం కష్టమవుతుందని, అందుకుగాను మున్సిపల్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు నెల్లూరు పట్టణాన్ని పోస్టర్ ఫ్రీ గా మారుస్తున్నారని,అలాగే జగ్గయ్యపేట పట్టణాన్ని ఫ్లెక్సీ రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, దానిలో భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో ఈరోజు ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టామని, పట్టణంలో ఏ రకమైన పోస్టర్,ఫ్లెక్సీ ఉన్న తీసివేయడం జరుగుతుందని, ఇప్పటికే వారం రోజుల క్రితం తొలగింపు చేపడతామని అనౌన్స్ చేయడం జరిగిందని, ఈరోజు నుంచి ప్రతి పోస్టర్ను తొలగిస్తామని, కేవలం దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లు మాత్రమే ఉంచుతున్నామని దీపావళి తర్వాత రోజున అవి కూడా తీసివేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ మునిసిపాలిటీ వారికి సహకరించాలని తద్వారా పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని కోరారు.

ఈ సందర్భంగా తమ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కట్టిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే గారు స్వయంగా తొలగించారు.

ఇకపై ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయదల్చుకుంటే ముందుగానే మున్సిపాలిటీ వారికి తెలియజేయాలని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు మూడు రోజులు కంటే ఎక్కువ రోజులు ఉంచకూడదని తెలిపారు. 

ఇకనుంచి అందరూ డిజిటల్ మీడియాను ప్రచార సాధనంగా వాడాలని, ఫ్లెక్సీలు,పోస్టర్లు తగ్గిస్తే ప్లాస్టిక్ కూడా తగ్గించినట్లు అవుతుందని,అందరూ సహకరించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీరంగాపురం రాఘవేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333