పోలీస్ వ్యవస్థలో పెట్రోలింగ్ వాహనాలదే కీలకపాత్ర

Jan 11, 2026 - 22:20
 0  67
పోలీస్ వ్యవస్థలో పెట్రోలింగ్ వాహనాలదే కీలకపాత్ర

  తిరుమలగిరి 12 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం లోని పోలీస్ వ్యవస్థలో పెట్రోలింగ్ వాహనాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏ చిన్న సమాచారం అందిన వెంటనే క్షణాల్లో స్పందిస్తూ, సంఘటన స్థలానికి సమయానికి చేరుకొని పరిస్థితులను సమీక్షించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. ప్రజలకు నేరుగా, వెంటనే అందుబాటులో ఉండే పోలీస్ విభాగం ఇదే.గ్రామ గ్రామానా నిరంతరం తిరుగుతూ పెట్రోల్ వెహికల్స్ శాంతిభద్రతల పరిరక్షణలో ముందంజలో ఉన్నాయి. అనుమానాస్పద కదలికలను గమనించడం, చిన్న గొడవలు పెద్ద సమస్యలుగా మారకుండా అడ్డుకోవడం, నేరాలకు ముందే అడ్డుకట్ట వేయడం వంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. దీంతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంలో పెట్రోలింగ్ వ్యవస్థ ప్రధాన పోషిస్తోంది.ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేయడం వల్ల దొంగతనాలు, చోరీలు, అక్రమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. పోలీస్ వాహనం కనిపిస్తే చాలు, నేరగాళ్లలో భయం, ప్రజల్లో ధైర్యం కలుగుతోంది. మహిళలు, వృద్ధులు, నిర్భయంగా జీవించే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, కుటుంబ కలహాలు వంటి ఆపద సమయాల్లో మేమున్నాం అంటూ ముందుగా స్పందించేది కూడా పెట్రోలింగ్ వాహనాలే. బాధితులకు తక్షణ సహాయం అందించడం, అవసరమైతే ఆసుపత్రులకు తరలించడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచుతున్నాయి.ప్రజలతో నిత్యం మమేకమై, వారి సమస్యలను అక్కడికక్కడే విని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ తెలంగాణ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైర్‌లెస్ కమ్యూనికేషన్ సహకారంతో వేగంగా స్పందించడం సాధ్యమవుతోంది.మొత్తంగా చూస్తే, పెట్రోలింగ్ వాహనాలు కేవలం పోలీస్ వాహనాలే కాదు అవి ప్రజల భద్రతకు భరోసా, ప్రశాంత జీవనానికి రక్షణ. పోలీసుల అంకితభావం, నిరంతర పెట్రోలింగ్ వల్లనే పాలన సజావుగా సాగుతుంది.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి