పోలీస్ ఉద్యోగవిరమణ అధికారికి ఘన సన్మానం..
ఉద్యోగవిరమణ పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దస్తగిర్.
ఉద్యోగవిరమణ పొందిన షేక్ దస్తగిర్ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ నరసింహ.
- సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.
--- నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట.
సూర్యాపేట,01 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న షేక్ దస్తగిర్ ఈరోజు ఉద్యోగవిరమణ పొందినారు. ఈ సందర్భంగా ఉద్యోగవిరణ పొందిన ఏఎస్ఐ ని వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి కె.నరసింహ ఘనంగా సన్మానించారు, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీసు డిపార్ట్మెంట్ నందు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను అభినందించారు, ఈ ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో సుఖ సంతోషాలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు. రిటైర్మెంట్ అనేది వయస్సు కే కానీ మనసుకు కాదు నచ్చిన పనిలో కృషి చేయాలని అన్నారు. అధికారులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు బంధువులు మాట్లాడుతూ విధులలో అంకితభావంతో, బాధ్యతతో పని చేసేవారనీ, కష్టపడే తత్వం కలవారని, అధికారులకు, క్రిందిస్తాయి సిబ్బందితో కలుపుకుని పోయేవారు అని తెలిపినారు..
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, AO మంజు భార్గవి, డిఎస్పీ నరసింహ చారి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు SI రామచందర్ గౌడ్, ఆర్ఐ ప్రవీణ్ కుమార్, జానయ్య, వెల్ఫేర్ ఎస్ఐ సాయిరాం, రిటైర్డ్ పోలీసు సంఘం కృష్ణా రెడ్డి, అబ్దుల్లా, పోలీస్ సంఘం సభ్యులు వెంకన్న, అంజన్ రెడ్డి, నరసింహారావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.