పెద్ద మారు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Apr 5, 2024 - 20:54
 0  102
పెద్ద మారు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

05-04-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

 చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన  పెద్ద మారు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. 

 ప్రభుత్వ పాఠశాలలో 2000- 2001 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థులు చిన్నంబావి మండలం లోని పెద్ద మారు గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ ఆవరణంలో శుక్రవారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో చిన్ననాటి మిత్రులు ఒకే వేదికపై కలుసుకోవడంతో ఎంతో ఆనందంతో మునిగి పోయారు. చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ వారి క్షేమ సంగతులుపంచుకున్నారు.ఇలాంటి స్నేహబంధం కలకాలం కొనసాగిందామని తీర్మానం చేసుకున్నారు. అనంతరం ఆనాటి విద్యా బోధన చేసిన గురువులను పూల మాలలతో  శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కొప్పునూరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ బుజ్జి రెడ్డి సారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన జీవితంతో ప్రాథమిక విద్య అనంతరం ఉన్నత చదువుల కొరకు వెళ్లే విద్యార్థిలకు దశ దిశ నిర్దేశించేది ఉపాధ్యాయులేనని, పాఠశాల వద్దనే తల్లిదండ్రులు గురువులు ఆ తర్వాతనే సమాజం అని గుర్తు చేశారు. ఆనాడు ఎవరైతే విద్యార్థులు ఉపాధ్యాయులకు అందుబాటులో క్రమశిక్షణతో ఉన్నారో వారు ఈ రోజు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారని అన్నారు ఆనాడు పాఠశాలకు దూరంగా ఉన్నవారు ఈరోజు జీవితంలో రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారని ముందు తరాలకు ఇది జ్ఞాపకం ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State