మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ హౌస్ రిజర్వాయర్ ను పరిశీలించిన

కలెక్టర్ మను చౌదరి 

Apr 5, 2024 - 20:39
Apr 6, 2024 - 12:39
 0  46
మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ హౌస్ రిజర్వాయర్ ను పరిశీలించిన

ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా 

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు

తెలంగాణవార్త కొండపాక:-  కుక్కునూరు పల్లి మండలంలోని మంగోల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఫిల్టర్ హౌస్, ల్యాబ్, 75 మిలియన్ లీటర్స్ క్లియర్ వాటర్ రిజర్వాయర్ ను  పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మరియు ఆర్డబ్ల్యూఎస్  ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సిఇ విజయ్ ప్రకాష్ మరియు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్  అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా పిఆర్ అండ్ ఆర్డి మరియు ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా సమ్మర్ సీజన్లో త్రాగునీటి కోసం ప్రజలుకు ఇబ్బంది కలగవద్దు అని ప్రభుత్వం గ్రామాలు మరియు పట్టణాల్లో త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందరికీ తెలుసు మన రాష్ట్రంలో వాటర్ సప్లై ఎలా ఉంటుందో గ్రామాలు మరియు మున్సిపాలిటీలో RWS ద్వారా నాణ్యమైన త్రాగునీటిని సరఫరా చేస్తాము.దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్  అన్నీ అందుబాటులో ఉన్నాయి.

 ఇంటెక్ పంపింగ్, వాటర్ గ్రిడ్ ప్లాను అన్నీ ఉన్నాయి. 

ఇంట్రావిల్లెజ్ స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైన్ లను ఒక నెల ముందునుండే ప్రత్యేక డ్రైవ్ ద్వారా పరిశీలించి అవుసరమైన మారమ్మత్తులను చేసాము. వీటితో పాటు ప్రత్యన్మాయంగా RWS డిపార్ట్మెంట్ ద్వారా బోర్లను, చేతిపంపులను రిపేర్ చేయించాము. అవుసరమైతే ట్యాంకర్ల ద్వారానీటిని సరఫరా చేసేందుకు కలెక్టర్ లను ఆదేశించాము. ఎక్కడైనా నీటి సరఫరాలో ఏదైన సమస్య తలెత్తితే టైం బాండ్ ప్రకారం నీటి సరఫరాను పునరుద్దరించేందుకు చెర్యలు చేపట్టాము.  త్రాగునీటి సరఫరాలో చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్న రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని సరఫరా చేస్తున్నాము.  నాగార్జునసాగర్ నుండి 2 TMC నీటిని పాలేరు తరలించాము. ఉదయసముద్రంకు కూడా 2 టిఎంసి నీటిని తీసుకెళ్తున్నాం.  ప్రతి రిజర్వాయర్ పై నిఘా ఉంది. ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెదక్ లో లాగా ఇంట్రవిలేజ్ పైప్ లైన్ కు సమస్య వచ్చిన తట్టుకునేలా అన్ని అల్టనేటివ్స్ బోర్ వెల్, హ్యాండ్ పంప్  వర్కింగ్ కండిషన్ లో ఉంచేలా సంభంధిత అధికారులను ఆదేశించాము. ఏ స్థితిలో కూడా  ప్రజలకు ఇబ్బంది రాకూడదనే ప్రభుత్వం లక్ష్యం. ప్రతిరోజు కలెక్టర్లు రివ్యూ చేసి చర్యలు తీసుకుంటున్నారు.

రేపు ఏజెన్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాను.  మాలెవల్లో కూడా ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఏజెన్సీలను  కూడా అప్రమత్తం చేసి ఎక్కడైనా మోటార్స్ కరాబ్ అయినా వెంటనే రిపేర్ చేయిస్తున్నాము.  ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది కలగకూడదని  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే సంబంధిత శాఖలతో చీఫ్ సెక్రటరీ నేరుగా  రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నారు.  నెలరోజులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా  గ్రామాలలో త్రాగునీటి సరఫరా వ్యవస్థ చాలా ప్రతిష్టంగా ఉంది. అవుసరమైతే అయితే గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా కూడా సరఫరా చేస్తాము.  నీటి సరఫరాకు ఎలాంటి సమస్య రాదు. వస్తే ప్రత్యాన్మయ నీటి సరఫరా ఏర్పాట్లకు జిల్లా కలెక్టర్ ల వద్ద ప్రత్యేకంగా నిధులు అందుబాటులో ఉన్నాయి.

 జులై వరకు నీటి సరఫరాలో  ఎలాంటి  ఇబ్బందులు తలెత్తకుండా  పకడ్బందీగా  చర్యలు చేపట్టాం.అని చెప్పారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333