అడ్డగూడూరులో ఘనంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

Jul 23, 2024 - 21:40
Jul 25, 2024 - 09:04
 0  7
అడ్డగూడూరులో ఘనంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

అడ్డగూడూరు 23 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, టపాకాయలు కాల్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ లో పనిచేస్తూ, ఎన్నో రాష్ట్రాలకు ఇన్చార్జిగా పనిచేసేసి అగ్ర నాయకత్వం దృష్టిలో పడి నేడు భువనగిరి ఎంపీగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డి నేటి యువతకు ఆదర్శమని అన్నారు. ఎంపీ నిధులతో తన సొంత నియోజకవర్గం అయినటువంటి తుంగతుర్తి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు వల్లంబట్ల రవీందర్రావు, నిమ్మనగోటి జోజి, గూడెపు పాండు, మత్యాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పూలపల్లి సోమిరెడ్డి, బీసీసెల్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ముస్కు బిక్షం రెడ్డి, మెడబోయిన శ్రీను, మంద రామచంద్రు, మహిళ నాయకురాలు పనుమటి దుర్గ, రవీంద్ర చారి, చిప్పలపల్లి పరశురాం, రాచకొండ శ్రీను, యూత్ కాంగ్రెస్ నాయకులు చేడే మహేందర్, కప్పల రాజేష్, గూడెపు నాగరాజు, చేడే అంబేద్కర్, మారిశెట్టి మల్లేష్, సూరారం నవీన్, పూలపల్లి రాజశేఖర్ రెడ్డి, బండారి నవీన్, శ్రావణ్, గండెల రవి, పరిగెల మహేష్, సమీర్, బండి మహేష్, జోగు మధు, పయ్యావుల సాయి, నిమ్మనగోటి భాను, మందుల వెంకటేష్, శ్రీకాంత్, సోమశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.