పెండింగ్లో ఉన్న ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థుల ఆర్టిఎఫ్ ఎంటిఎఫ్ ఫీజులు వెంటనే విడుదల చేయాలి
జోగులాంబ గద్వాల 17 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల టౌన్:- జిల్లాలో నీ ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో చదివే ఇంటర్ డిగ్రీ పిజి చదువుతున్న ఎస్సీ బీసీ మైనారిటీ నిరుపేద విద్యార్థుల ఆర్టిఎఫ్ ఎంటిఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కృష్ణవేణి చౌక్ లో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మానవహారం ధర్నా ర్యాలీ నిర్వహించారు.ప్రైవేటు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వము నుండి ఫీజులు మంజూరు కాకపోవడంతో ఆర్థిక సమస్యల వల్ల కళాశాలలు నడపలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు అధ్యభవనాల కిరాయిలు చెల్లించలేక అధ్యాపకుల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నెల నెల కరెంటు నల్ల బిల్లులు కట్టలేకపోవడం బ్యాంకు లోన్లు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అకౌంట్స్ ఎన్ పి ఏ బ్యాంకు లింకులు బ్లాక్ లిస్టు లో ఉన్నాయని తెలిపారు. అలాగే మున్సిపల్ ట్యాక్సీలు గ్రామపంచాయతీ టాక్సీలు చెల్లించలేకపోవడం విచారకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా విద్యార్థులకు ఆర్టీఎఫ్ ఎంటిఎఫ్ బకాయిల ఫీజులు తోపాటు కొత్త ప్రభుత్వము ఏర్పడిన తర్వాత విద్యార్థులకు రెగ్యులర్గా ఫీజు చెల్లించే విధానం తెస్తామని చెప్పి పది నెలలైనా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తీపి డిఎంఏ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల ప్రకారం తేదీ 14 నుండి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు జూనియర్ డిగ్రీ పిజి కళాశాలల విద్యార్థులు నిరవధిక సమ్మె కొనసాగుతున్నదని తెలిపారు. ఆయా విద్యాసంస్థలు పనిచేస్తున్న ఆయా విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు 1,50,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, బీసీ వెల్ఫేర్ శాఖామంత్రి ఈ విషయంపై స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎం నారాయణ గౌడ్, నవోదయ సుధాకర్, సోమనాద్రి భాస్కర్ రెడ్డి, కృష్ణవేణి రమేష్, ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.