క్యాలుగద్వాల ఆణిముత్యాలు మట్టిలోనే మాణి ఎంబిబిఎస్ సీటు సాధించిన విద్యార్థులకు సన్మానించిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల 17 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఇటీవల వెలు బడిన ఎంబిబిఎస్ ఫలితాలలో గద్వాల నియోజకవర్గం లోని గట్టు మండలం చెందిన
ఆరు మంది విద్యార్థిని విద్యార్థులకు వివిధ జిల్లాల లోని మెడికల్ కళాశాలలో సీట్లు సాధించిన
J. ఝాన్సీ రాణి D/o జై విజయ్ కుమార్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట .
జి .సాయి స్ఫూర్తి d/o శ్రీనివాస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, భద్రాద్రి కొత్తగూడెం కళాశాల .
MD సోహెల్ s/o ఎండి బషీర్, గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ .
కుర్వా కుమార్ s/o హనుమంతు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, భద్రాద్రి కొత్తగూడెం కళాశాల .
సానియా బిజ్ఞ s/o శ్రీనివాసులు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గద్వాల.
ఎన్ .అక్షయ s/o శంకర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కరీంనగర్.
ఎంబిబిఎస్ లో సీటును సాధించిన విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు*
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి . శాలువా కప్పి పుష్పగుచ్చం, కానుకను ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ....
గద్వాల నియోజకవర్గం గట్టు మండలన్ని గతంలో అక్షరాస్యతలో వెనుకబడి ప్రాంతంగా పిలువబడే గట్టు మండలం, నేటి విద్యార్థుల అక్షరాలతో విద్యారంగంలో ముందడుగు వేయడం చాలా సంతోషంగా ఉందని. అదేవిధంగా విద్యార్థులు పట్టుదలతో శ్రమతో చదువుకొని విద్యా రంగంలో, ఇంజినీరింగ్ లో, వైద్యరంగంలో అయినా ఎంబిబిఎస్ లో సీటు సాధించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఎంబిబిఎస్ లో సీటు సాధించిన విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మీ గ్రామానికి, గద్వాల నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.
అదేవిధంగా వైద్యరంగంలో మెరుగైన శిక్షణ పొంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు.
వీరిని ఆదర్శంగా తీసుకొని గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలంలో మరి కొంతమంది విద్యార్థులు వైద్యరంగంతో పాటు వివిధ రంగాలలో కూడా రాణించాలి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకున్నప్పుడే మీరు నిర్ణయించుకున్న భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని లక్ష్యం నెరవేరుతుందని ఆకాంక్షించారు.
ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ ఫీచర్ అని తెలిపారు
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, కౌన్సిలర్ మురళి మాజీ ఎంపీపీ విజయ్, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు ఆంజనేయులు, హనుమంతు రెడ్డి, గోపి, మధుసూదన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.