పూర్వ విద్యార్థుల సమ్మేళనం

May 11, 2025 - 20:24
 0  7
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  మండలంలోని కందగట్ల లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. 2005-2006 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు గురువులను ఘనంగా సన్మానించారు. రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న గురువులు, ఉపాధ్యాయులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో రోజంతా ఉత్సాహంగా గడిపారు. గురువులు సైతం విద్యార్థులతో కలిసిపోయి సంతోషంగా గడిపారు. అలనాటి రోజులను గుర్తు చేసుకొని గురువులకు పాదాభివందనం చేశారు తమను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన గురువులకు ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. గురువులు సైతం విద్యార్థులు చూపిన ప్రేమకు ఉప్పొంగి పోయారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్ సోమయ్య, వెంకీ, రోజా, విద్యార్థులు నాగరాజు, నరేష్, జానీ, శంకర్, కవిరాజు, స్వప్న, ఉమా, స్వరూప తదితరులు పాల్గొన్నారు.