సాయుధ పోరాట వీరుడు బీమిరెడ్డి
నేటి తరం యువత బీమిరెడ్డి ని ఆదర్శంగా తీసుకోవాలి.
వేలాది ఎకరాలు భూములు పంచిన చరిత్ర బీమిరెడ్డి ది. .
జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,
సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు,పంతంగి వీరస్వామి గౌడ్.
(సూర్యాపేట టౌన్ మే 09) : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు బిమిరెడ్డి నర్సింహ రెడ్డి అని ఆయన చేసిన సాయుధ పోరాట చరిత్ర మరువలేనిదని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతoగి వీరస్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనీ 60ఫీట్ల రోడ్డు లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి 17 వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి విలేకరులతో మాట్లాడారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి భూమి,భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారనీ కొనియాడారు. వేలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర ఆయనకి దక్కిందన్నారు. ప్రజాక్షేత్రంలో మూడు సార్లు ఎంపీగా ,రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యలపై చట్టసభల్లో గొంతెత్తిన ధీశాలి అని గుర్తు చేశారు. ఆనాడు చాకలి ఐలమ్మ కు అండగా నిలిచి ఆమెను తెలంగాణ సాయుధ పోరాటానికి సన్నద్ధం చేసిన నాయకుడు అని చెప్పుకొచ్చారు. నేటి తరం యువత భీమిరెడ్డి నర్సింహారెడ్డి ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని సూచించారు. నల్లగొండ జిల్లా కరివిరాల కొత్తగూడెం లో పుట్టిన కమ్యూనిస్టు యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలో భీమిరెడ్డి నరసింహారెడ్డి జ్ఞాపకార్ధంగా ఒక ఎకరం స్థలం స్మారక భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ , జిల్లా గౌర సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, అయితే గాని మల్లయ్య గౌడ్, ఖమ్మం పార్టీ అంజయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టేటి కిరణ్, నల్లకుంట అయోధ్య, ఇటువంటి రాంబాబు, లింగారెడ్డి, సారగండ్ల కోటేష్, తదితరులు పాల్గొన్నారు.