పునాదులకే పరిమితమైన జిల్లా గ్రంధాలయ భవనం
జోగులాంబ గద్వాల 2 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనం పునాదులకే పరిమితమైంది. గ్రంథాలయ నిర్మాణానికి రూ కోటి అరవై లక్షలు మంజూరు కాగా గత ఏడాది పిల్లర్ల వరకు పనులు చేసి నిధులు లేక నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్ కూడా బిల్లుల మంజూరు కాక మధ్యలో నిలిచిపోవడంతో పాఠకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రంథాలయం కేఎల్ఐ క్యాంపులో ఇరుకు గబులలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీసం వసతులు కూడా లేవు. దీనిపై ఇదివరకే పలువురు ఆందోళనలు వ్యక్తం చేసిన నేటి వరకు జిల్లా కలెక్టర్ గాని ఇలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు పాఠకులు ఆరోపిస్తున్నారు. వెంటనే గ్రంధాలయ భావన నిర్మాణ పనులు పున ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.