పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, మానవ పౌర హక్కుల
నేత, అక్రమ ఖైదీలకు అండగా నిలిచిన కేజీ కరుణాభిరాన్ గారిని స్ఫూర్తిగా తీసుకుందాం
పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వ్యవస్థాపకుల్లో ఒకరు, మానవ పౌర హక్కుల నేత, అక్రమ ఖైదీలకు అండగా నిలిచిన కేజీ కరుణాభిరాన్ గారిని స్ఫూర్తిగా తీసుకుందాం.కీలెరిగి వాత పెట్టే మాదిరిగా మన మన రంగాలలో హక్కుల కోసం ఉద్యమిద్దాం!స్ఫూర్తి పొందడానికి ఆలోచించండి..
వడ్డేపల్లి మల్లేశం
30...12...2024
చరిత్రలో ప్రజల కోసం పనిచేసి నిలిచి గెలిచిన అనేకమంది మహానుభావుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు వారి వ్యక్తిగత జీవితం ఎక్కడ అంతగా కనిపించదు బహుశా వారి పుట్టుక నుండే పోరాట సామాజిక జీవితం మొదలవుతుందా? అంటే అతిశయోక్తి కాదేమో! అందుకు కేజీ కన్నాభిరాన్ గారి జీవితం కూడా మినహాయింపు కానట్లే మనకు కనిపిస్తున్నది. పేద మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించినప్పటికీ అనేకమంది పోరాట వీరులు నిలదొక్కుకున్న తీరు ఆశ్చర్యకరం మాత్రమే కాదు మనకు స్ఫూర్తినిస్తుంది కూడా. ఆ సోయి మానవతా విలువలు సామాజిక బాధ్యత మనకు ఉండాలి కానీ మనం కూడా ఆ చరిత్రలు చదివి పోరుబాటలో ఉద్యమాల నీడలో కొనసాగాల్సిందే ప్రశ్నించి అడుగడుగునా అవినీతిని ఆకృత్యాలను ప్రతిఘటించవలసిందే. నవంబర్ 9, 1929 రోజున తమిళనాడులోని మధురైలో కంద డై గోపాలస్వామి అయ్యంగార్ పంకజం దంపతులకు జన్మించినప్పటికీ వీరి ప్రాథమిక జీవితం కష్టాల్లోనే గడిపినట్లుగా తెలుస్తున్నది.అయినప్పటికీ పట్టుదల విడవకుండా కుటుంబ పరిస్థితులను లక్ష్యానికి సిద్ధాంతానికి అనవయించుకొని ఆ వైపుగా వెళ్ళినాడు కనుకనే ఇవాళ చరిత్రలో నిలిచిపోయినాడు. కన్నాభిరాన్ పూర్వీకులు తమిళ్లు తరతరాలుగా ఆయన కుటుంబీకులు నెల్లూరులో జీవిస్తున్న కారణంగా ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రము న్యాయ శాస్త్రాలలో పట్టభద్రులై మద్రాస్ బార్ కౌన్సిల్లో చేరి 1953 నుండి న్యాయవాద వృత్తిని చేపట్టినట్టుగా తెలుస్తున్నది. 1960 ప్రాంతంలో హైదరాబాద్ కు వచ్చి న్యాయవాదిగా హైకోర్టులో కృషి చేసిన తర్వాత నిలుదొ కున్నప్పటికీ ఆయన దృష్టి మాత్రం సామాజిక పరిణామాల మీద మానవ హక్కుల మీద రాజకీయ ఇతరత్రా అక్రమంగా నిర్బంధించబడుతున్న ఖైదీల మీదనే అని మనం స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది.
న్యాయవాదిగా పౌరహక్కుల సంఘం బాధ్యునిగా :- న్యాయవాద వృత్తిని మద్రాసులో తొలిసారి చేపట్టినప్పటికీ అనతి కాలంలోనే ఆయన తన నివాసాన్ని హైదరాబాద్ మార్చుకోవడంతో ఉద్యమ స్ఫూర్తి మరింత పెరగడానికి ఇక్కడి పరిస్థితులు ఎంతో తోడ్పడినట్లు తెలుస్తున్నది. 1970 ప్రాంతంలో హైదరాబాదులో న్యాయవాదులు కొంతమంది కూడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిర్బంధకాండ కు వ్యతిరేకంగా పనిచేయడానికి నక్ష లైట్ డిఫెన్స్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి దానికి కన్నాభిరాం గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. ఆయన నాయకత్వంలోని న్యాయవాదుల బృందం ఆనాటి నుండి పార్వతీపురం హైదరాబాదు కుట్ర కేసులలో డిఫెన్స్ న్యాయవాదులుగా పని చేయడంతో పాటు అప్పట్లో ప్రారంభమైనటువంటి పౌర హక్కుల ఉద్యమం విస్తృతంగా విభిన్న రూపాలలో ప్రస్తుత స్థితిలో నిలబడడానికి ఆయనే ప్రధాన కారణం అంటే అతిషయోక్తి కాదు. అత్యవసర పరిస్థితి కాలంలో 1975 76 ప్రాంతంలో డి టెన్ న్యూస్ గా ఉన్న వారి తరఫున వాదించడానికి మిగిలి ఉన్న ఒకే ఒక్క లాయరు కన్నాభిరాం గారంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఒత్తిళ్లు నిర్బంధాలు ఎదురైనా న్యాయానికి మారుపేరుగా వెన్నుదన్నుగా నిలిచి రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధన్యజీవిగా మనం చరిత్రలో కన్నాభిరాన్ గారిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఏపీ సి ఎల్ సి కి 15 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో దాదాపు దేశం లోని అన్ని పౌర మానవ హక్కుల సంస్థలతో కార్యకర్తలతో సత్సంబంధాలు నెలకొల్పుకొని ఆ ఉద్యమంలో పనిచేయడం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సజీవంగా ఉన్నదంటే ఆ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది ని టారుగా నిలబెట్టింది కన్నాభిరాను గాక మరి ఎవరు? పోలీసులు ఎవరిపైన అయినా తప్పుడు కేసులు పెట్టినప్పుడు చాకచక్యంతో న్యాయ శాస్త్రం మీద పట్టుతో వాటిలోని లొసుగులను బయటపెట్టి కేసులను బలంగా వాదించి ఎదుటి ప్రత్యర్థులను అబ్బురపరచడమే కాదు నిందితులకు న్యాయం చేసేవాడు lఆయన ఆశయము ఆలోచన అంతా న్యాయపాలన సమన్యాయ పాలన నిష్పాక్షికంగా అమలు కావడం పైన దృష్టి సారించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని వారితో సత్సంబంధాలు కలిగిన వారు చెబుతూ ఉంటే ఎంతో స్ఫూర్తినిస్తుంది. పి యు సి ఎల్, ఏపీ సి ఎల్ సి, ప్రారంభం మానవ హక్కుల నేతగా కన్నాభిరాన్ హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహించడం ప్రారంభించిన తర్వాత సాధారణ వివాదాల పట్ల దృష్టి పెట్టకుండా రాజకీయ ఖైదీల కేసులు మానవహక్కుల సంబంధించిన అంశాల పైన ఎక్కువగా వాదించేవారు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థకు సహా వ్యవస్థాపకులుగా పనిచేసే అధ్యక్షులుగా కొనసాగి ముఖ్యంగా బడుగు బలహీన పీడిత తాడిత ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నక్సలైట్లపైన జరిగిన ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కేసులను వాదించి జీవించే హక్కును ఛాలెంజ్ చేసిన న్యాయవాదిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి కేసులు నాలుగు ముఖ్యమైనవి అని చెబుతారు వాటిలో శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం, తరిమెళ నాగిరెడ్డి, సికింద్రాబాద్, రాంనగర్ కుట్ర కేసులు. సాధారణ భావజాలాలకు భిన్నంగా మానవ హక్కులను పరిరక్షించే ఉద్దేశ్యముతో రాజ్య హింసకు వ్యతిరేకంగా కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఆయన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ను ప్రారంభించినట్లుగా తెలుస్తున్నది. ముఖ్యంగా పౌర స్వేచ్ఛ, మానవ హక్కులు, సమానత్వము, దోపిడిని ప్రతిఘటించడము, ప్రజా సంపాదన సమానంగా అనుభవించడం వంటి హక్కుల కోసం పోరాడటమే కాదు వివిధ రాజకీయ పార్టీల నేతలను కూడా ఒకే వేదిక మీదకు తెచ్చి చర్చించి వారితో ఒప్పించడం చరిత్రాత్మకం. .2010 డిసెంబర్ 30వ తేదీ నాడు హైదరాబాదులో చనిపోతే 1995 నుండి 2009 వరకు కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థకు స్థానికంగా వెన్నుద న్నుగా ఉంటూనే జాతీయ ఎగ్జిక్యూటివ్లలో ఒకరుగా తన కృషిని నిరంతరం కొనసాగించి చివరి రక్తపు బొట్టు వరకు కూడా మానవ పౌర హక్కుల పరిరక్షణ కోసం అలుపెరుగని పోరు చేసిన పోరాట వీరుడు ధీరుడు ఎర్ర సూర్యుడు కేజీ కన్నాభి రాన్.ఉండే లేని వసతులతో చాలీచాలని జీవితంతో కుటుంబ సభ్యులు సహకరించకపోయినా ఎంచుకున్న మార్గాన్ని చివరిదాకా వీడకుండా హక్కుల కోసమే పని చేసి అనితర సాధ్యం అనిపించుకున్న కేజీ కన్నాభీరాన్ జీవితము నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? అని ఎప్పుడైనా ఆలోచించినామా? చరిత్ర తెలిస్తే కానీ ఆలోచనకు అవకాశం దొరకదు మనతోపాటు తోటి వాళ్ళెంతరో అనునిత్యం దోపిడీ,పీడ నకు గురవుతూనే ఉన్నారు కానీ రాజీ పడుతూ బానిసలుగా బతకడం కంటే మనం పోరాటం చేస్తూ ఇతరుల కోసం కూడా మనం చేయూత అందిద్దాం. న్యాయవాదులను, న్యాయ శాస్త్రాన్ని,సమాజాన్ని, సామాజిక చింతనను మన ప్రశ్నల ద్వారా భావజాలం ద్వారా ఆలోచనల ద్వారా విస్తృతం చేద్దాం. అదే మనం ఆయనకు ఇవ్వగలిగిన ఘనమైన నివాళి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు హరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )