సిటీ నిర్మానుష్యం -తగ్గిన కాలుష్యం

సంక్రాతి పండుగ వేళ
పల్లెకు జన జాతర
సిటీ ఖాళీ అయింది
ధ్వని ఆగిపోయింది
వేలాది వాహనాలు
లక్షలాదిగా ప్రజలు
సెలవులలో సేదతీరటానికి
పల్లె సొగసులు చూడడానికి
ఇంటికి తాళమేసి
కుటుంబతొ బయలుదేరిరి
భోగి మంటలకు
సంక్రాతి సంబరాలకు జరుపుటకు
రోడ్లన్నీ నిజదర్శన మిస్తున్నాయి
విశాలంగా కనబడుచున్నాయి
నిశ్శబ్ద వాతావరణం ఉంది
నిర్మానుష్యమైంది నగరం
కాలుష్యం తగ్గింది
మంచి గాలి వీస్తుంది
స్వేచ్చగా శ్వాస ఆడుతుంది
అడ్డంకుంలు లేని ప్రయాణం సాగుతుంది
ప్రతి పండుగకు ఇదే జరిగితే
ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది
ఈ పట్నానికి కాలుష్యపు బారినుండి
కొంతైనా మేలు కలుగుతుంది.
రచన. కడెం. ధనంజయ, చిత్తలూర్.