పాఠశాల సమస్యల కొరకు ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చెయ్యాలి జె ఏ సి చేర్మెన్ భూపతి రాములు

Jun 21, 2025 - 21:32
 0  16
పాఠశాల సమస్యల కొరకు ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చెయ్యాలి జె ఏ సి చేర్మెన్ భూపతి రాములు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పాఠశాల సమస్యల కొరకు ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు*ఆత్మకూరు ఎస్.. మండల సామాజిక సేవా జె ఏ సి ప్రతిపాదన మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు, నమ్మకం కలిగించే విధంగా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల ఫలితాలు పట్ల భరోసా కలిగించడానికి శనివారం ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేసి,ఏలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా విద్యార్థులకు స్వచ్ఛమైన విద్య, ఫలితాలను అందించడానికి ముందుకు వచ్చారు, ఈ ఫిర్యాదుల పెట్టె వలన గ్రామస్తులు విద్యార్థులు ఉపాధ్యాయుల పైన మరింత జాగ్రత్త పెరగనుంది, ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు భూపతి రాములు మాట్లాడుతూ, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను పిల్లలకు అందివ్వాలని, ప్రైవేట్ పాఠశాల లేని ప్రైవేట్ బస్సులు తిరగని మండలం గా మన ఆత్మకూర్ మండలాన్ని తీర్చిదిద్దాలని, ఈ ఉద్యమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పౌరులందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వెంకన్న,ఉపాధ్యాయులు, రవి, బొల్లెద్దు వెంకన్న, జేఏసీ సబ్యులు కృపాకర్, కర్నాకర్, నాగరాజు, మేడి కృష్ణ,pow నాయకురాలు నరసక్క,pyl నాయకులు నల్లగొండ నాగయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.