99 జీవోను రద్దు చేసి, 22 రోస్టర్ పాయింట్ నుండి ఒకటవ రోస్టర్ పాయింటుగా సవరించాలని

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యల క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తున్న మాల మహానాడు నాయకులను ఈరోజు ఉదయం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన చిగురుమామిడి పోలీసులు. ఇందులో మాల మహానాడు హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు బొలుమల్ల రాజమౌళి, చిగురుమామిడి మాల మహానాడు మండలాధ్యక్షులు రాకం కరుణాకర్, నాయకులు రాగుల ధర్మేందర్, మాశం సది కుమార్, మహిళా నాయకులు రాకం అంజవ్వ, మాచ మల్ల కిషోర్ తదితరులున్నారు.