పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవు

Mar 12, 2025 - 18:31
Mar 12, 2025 - 19:48
 0  1
పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవు

మునగాల 12 మర్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :- ఆటోచోదకులు పరిమితి మించి కూలీలను ఆటోలో తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరిమితికి మించి కూలీలను తరలిస్తున్న 5 ఆటోలను మండల కేంద్ర శివారులో పట్టుకొని బుధవారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆటోలకు నిబంధనల ప్రకారం ఫైన్స్ విధించారు. అనంతరం ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి., ప్రొఫెషన్ ఎస్ఐ గోపాల్ రెడ్డితో కలిసి ఆటో డ్రైవర్లకు కూలీలకు అవగాహన కల్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆటోచోదకులు డ్రైవింగ్ సీట్ కిరువైపులా కూలీలను కూర్చోబెట్టుకోవటం గాని, పరిమితికి మించి కూలీలు ఎక్కించుకున్న చర్యలు తప్ప వ న్నారు ఆటో చోదకుడు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఆటోకు ఆర్ సి,,, పొల్యూషన్ క్లియరెన్స్ ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కానిస్టేబుల్ శివ కోటేశ్వరరావు, రవి తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State