జిల్లా ఆస్పత్రిలో ప్రతిరోజు స్క్రీనింగ్ నిర్వహణ
జోగులాంబ గద్వాల 7 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా మహిళలు అందరు " గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరు చేయించుకోవాలి :- ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజ్గర్ అలీ
... జిల్లా ఆస్పత్రిలో ప్రతిరోజు స్క్రీనింగ్ నిర్వహణ
...13 పాజిటివ్ కేసులు నిర్ధారణ ట్రీట్మెంట్ కొనసాగింపు
. జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఆస్పత్రి నందు సర్వైకల్ క్యాన్సర్ ( గర్భాసయ ముఖద్వారా క్యాన్సర్).. ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది.. సందర్భంగా ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజ్గర్ అలీ , జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ సందర్శించి పలు రికార్డులను తనకి చేసారు... సర్వైకల్ స్క్రీనింగ్ ట్రైనర్ నిర్మల సిస్టర్ ని అడగగా... 2025 సంవత్సరం నుండి ఇంతవరకు 13 కేసులను పాజిటివ్గా గుర్తించడం జరిగిందని వారిని ఎంఎన్జే ఆసుపత్రికి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిచ్చామని సందర్భంగా తెలిపారు.... 2026 జనవరి నుండి ఇంతవరకు 234 మందికి స్క్రీనింగ్ నిర్వహించామని... ఒకరిని అనుమానితులుగా గుర్తించి ఎంఎన్జే ఆసుపత్రికి పంపించామని కి తెలిపారు.... మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి మహిళ సర్వైకల్ స్క్రీనింగ్ నిర్వహించుకోవాలని... మొదట ఏవైనా పాజిటివ్గా గుర్తిస్తే మందులతో నయమవుతుందని సందర్భంగా తెలిపారు.... గ్రామాలలో ఉన్న ఆశా కార్యకర్తలు మోటివేషన్ ద్వారా వారిని జిల్లాకు పిలిపించి స్క్రీనింగ్ నిర్వహించాలని వారి బాధ్యతగా తీసుకొని రావాలని సందర్భంగా తెలిపారు... అనంతరం ఎన్సిడి క్లినిక్ అన్ కంట్రోల్ వారు ఎంతమంది వస్తున్నారు అని స్టాఫ్ నర్స్ హేమలతను అడిగి తెలుసుకున్నారు. కన్ఫామ్డ్ కేసులు గుర్తించినచో వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారికి తెలియజేయాలని వారు ఎంఓ లాగిన్ నందు ఎంటర్ చేసి పోర్టల్ నందు నమోదు చేస్తారని.. నెల నెల ఫాలో చేస్తారని సందర్భంగా తెలిపారు... ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ లు Anm లు మరియు సిబ్బంది పాల్గొన్నారు