పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం.
జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- హెల్పింగ్ హాండ్స్ వారి మెటీరియల్ పంపిణి లో బాగంగా ఈ రోజు ధరూరు మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు N ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన 10 వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణి కార్యక్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యతిథిగా గౌరవనీయులు జిల్లా న్యాయసేవా అధికారి శ్రీమతి శ్రీ గంటా కవిత హాజరై వారి చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు మెటీరియల్ అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గద్వాల తాలూకాలో మొట్టమొదటి సారి హెల్పింగ్ హేండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇంత పెద్ద మొత్తంలో మెటీరియల్ ను తయారు చేసి తాలూకాలోని అన్ని ఉన్నత పాఠశాలలోన 3000 మంది 10వ తరగతి గ్రామీణ విద్యార్థులకు పంపిణి చేయడం చాల గర్వించ దగిన విషయం అని తెలియజేస్తూ ట్రస్ట్ వారికి ప్రతేక్య అభినందనలు తెలియజేసినారు. అదేవిదంగా విద్యార్థులందురు కూడా ఈ మెటీరియల్ ను ఉపయోగించుకొని క్రమశిక్షణ ,పట్టుదలతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మంచిగా చదివి మార్చిలో జరుగబోయో పరీక్షలను వ్రాసి 10/10 మార్కులు సాదించి మీ తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు, మీరు చదివిన పాఠశాలకు మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశ్వీరదించినారు. అలాగే ట్రస్ట్ వ్యవస్థాపకులు సీమల రత్నాసింహా రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ పాఠశాలలో చదుకునే పేద విద్యార్థులకు మావంతు సహాయాం చేసి తాలూకాను విద్యలో ముందుంచాలనే ఉదేశ్యంతో విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ మెటీరియల్ ను తయారు చేసి పంపిణి చేయడం జరుగుతుంది అని ఈ మెటీరియల్ పంపిణి కార్యక్రమునకు సహకరించిన విద్యాశాఖవారికి మరియు పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు. మరియు ఈ కార్యక్రమం లో పాల్గొన్న మండల MEO రవీంద్రబాబు మాట్లాడుతూ మర్చి 20 వ తారీకు నుండి 10 వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి కాబట్టి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ వారు తయారు చేసి పిల్లలకు ఈ సమయంలో అందజేడం చాలాఉపయోగపడుతుందని తెలుపుతూ ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసినారు.
ఈ కార్యకమంలో జిల్లా న్యాయసేవా అధికారి శ్రీమతి గంటా కవిత, MEO రవీంద్రబాబు,MRO, పాఠశాల ప్రధానోపాధ్యాయులు N.ప్రతాప్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.