నెమ్మికల్ సంత వేలం పై డీపీఓ కు పిర్యాదు
తెలంగాణ వార్త ఆత్మకూరు స్ మండల పరిధిలోని నెమ్మికల్ పశువుల సంత వేలం పాట జరిగి 15రోజులు గడుస్తున్న నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించక పోవడం పై స్థానికులు బుధవారం డీపీఓ కి పిర్యాదు చేశారు.పాట దక్కించుకున్న పాటదారుడు పాట పాడిన 24గంటల్లో మూడో వంతు డబ్బులు గ్రామ పంచాయతీ కి చెల్లించాల్సి ఉండగా కొంత చేల్లించలేదనీ, మిగతా డబ్బులకు జామీను కింద ఆస్తినీ మార్టిగేజ్ చేయలేదని ఆరోపించారు.ఈ పాట దారుడు గతం లో బినామీ పేరున పాటఇదే సంత దక్కించుకొని గ్రామ పంచాయతీ కి డబ్బులు సక్రమంగా చెల్లించలేదని అందుకే పాట రద్దు చేయాలంటూ గ్రామస్తులు బుడిగే సైదులు, రేణుకుంట్ల అనిల్ కుమార్, రేపాక వెంకట్ రెడ్డి, వీరబోయిన నాగరాజు పిర్యాదు చేశారు.