బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి.
జోగులాంబ గద్వాల 6 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఆరు నుండి 14 సంవత్సరాల వయసుగల బాలబాలికలను బడిలో చేర్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గద్వాల మండలం పూడూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో జెడ్పి హై స్కూల్ హెడ్మాస్టర్ పరమేశ్వర్ రెడ్డి, ఏ పీసీ చైర్మన్ శశికళ, ఎంపీటీసీ శంకర్ గౌడ్, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ సుభాన్, గ్రామస్తులు చిన్నయ్య, అంగన్వాడీ టీచర్లు, పూర్వ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొని ఇంటింటికి తిరిగి బడి ఈడు గల పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు ఉపాధ్యాయ నిలు అంగన్వాడీ టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.